వీవీఐపీలు ప్రయాణించే మార్గాల్లో తనిఖీలు
ASR: ఈనెల 16న ఒరిస్సా సీఎం మోహన్ చరణ్ మాఝీ పాడేరులో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం తెలిపారు. ఆయన పర్యాటనలో చింతలవీధిలో బిర్సాముండా విగ్రహావిష్కరణ చేస్తారన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తారని తెలిపారు. సభ జరిగే ప్రదేశంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.