'కులాలకతీతంగా.. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి'

MBNR: రాజాపూర్ మండలంలోని చిన్న వెళ్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎంపీ డీకే అరుణ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ..ఛత్రపతి శివాజీ హిందూ నవభారత నిర్మాణానికి కృషి చేశారని, పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దే నేర్చుకున్నాడన్నారు. కులాలకతీతంగా ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలన్నారు. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు.