పామిడిలో భోగేశ్వర స్వామికి విశేష పూజలు
ATP: పామిడిలోని భోగేశ్వర స్వామివారికి మార్గశిర మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని సుందర పుష్పమాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేసి, అష్టోత్తర పూజలు, నవ విధ హారతులు సమర్పించారు.