విజేతలకు నగదు బహుమతులు పంపిణీ

విజేతలకు నగదు బహుమతులు పంపిణీ

VZM: గజపతినగరం మండలంలోని రంగుపురం గ్రామంలో దివంగత శంకరాపు దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం ఆ గ్రామ యువత నిర్వహించిన వాలీబాల్ పోటీ విజేతలకు నగదు బహుమతులను ఆ గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మణ పంపిణీ చేశారు. ప్రధమ బహుమతి గెలిచిన చీపురుపల్లికి 15,000, ద్వితీయ స్థానం ముద్దూరుకు 10,000, తృతీయ స్థానం సంపాదించిన గంట్యాడ మండలం బూడిపేటకు 8,000 అందజేశారు.