'కేజ్రివాల్‌కు పంజాబ్ ప్రభుత్వం ATMలా మారింది'
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్‌కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్, ఆప్, అకాలీలకు పంజాబ్ చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేందుకు ఇప్పుడు బీజేపీకి అవకాశమివ్వాల్సిన సమయం వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు.