'రైతన్నకు అందని సాయం'

VKB: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. ఎక్కువగా ధారూరు, పూడూరు, పరిగి, దోమ, తాండూరు, VKB మండలాల్లో పంట నష్టం జరిగినట్లు జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. నష్టపోయిన పంటల్లో ఎక్కువగా పత్తి, మొక్కజొన్న, వరి, కూరగాయలున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం అందకపోవడంతో రైతులు ఆగ్రహిస్తున్నారు.