రూ.4 లక్షలతో రెండు మినీ గోకులం షెడ్లు ప్రారంభం

రూ.4 లక్షలతో రెండు మినీ గోకులం షెడ్లు ప్రారంభం

NDL: నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూర్ మండలం వీపనగండ్ల గ్రామంలో రైతులు, పాడి పశువుల అభివృద్ధి కోసం రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు మినీ గోకులం షెడ్లను ఎమ్మెల్యే శ్రీ గిత్త జయసూర్య ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి గోకులం షెడ్లు, పశుగ్రాసాన్ని రాయితీపై అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.