వెలుగోడు మండలంలో కురిసిన వర్షం

వెలుగోడు మండలంలో కురిసిన వర్షం

NDL: వెలుగోడు మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మోస్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఎండ తీవ్రంగా ఉండటంతో వర్షంతో ఉపశమనం కలిగించింది. గాలులతో పాటు అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా పనుల నిమిత్తం బయటకు వెళ్లిన వారు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.