'ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నాం'

MDK: MLC కవిత పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా తెలుపుతూ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ క్రమశిక్షణ తప్పారని మెదక్ జిల్లా BRS పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసిఆర్ ఆమెను సస్పెండ్ చేశారని తెలిపారు. KCR నిర్ణయాన్ని తామందరం స్వాగతిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.