అమెరికా మీడియాపై ట్రంప్ ఒత్తిడి!
ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వానికి మద్దతుగానే వార్తలు ప్రసారం చేయాలని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వార్తా సంస్థ ఈ భూగ్రహం మీద అత్యంత అవినీతిమయం అని మండిపడ్డారు.