మంత్రి అచ్చెన్న నేటి పర్యటన వివరాలు
SKLM: రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఉదయం 10.30 గంటలకు కోటబొమ్మాళి మండలంలో నూతనంగా నిర్మించిన డీసీసీబీ బ్యాంకుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తారు. అనంతరం పాతపట్నంలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు.