రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిరసన

MBNR: మానవపాడు మండలంలోని గోకులపాడు గ్రామానికి చెందిన ప్రజలు గ్రామ శివారులో దెబ్బతిన్న వంతెన వద్ద బుధవారం నిరసన చేపట్టారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల వంతెన, రోడ్లు దెబ్బతింటున్నాయని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.