సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రామగుండం సీపీ

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన రామగుండం సీపీ

కరీంనగర్: గోదావరిఖని రామగుండం పోలీస్ కమీషనరేట్‌ లో ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) మంగళవారం ప్రారంభించారు.సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేసుకునేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు కమీషనరేట్‌ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించడం జరిగిందని సీపీ శ్రీనివాస్ తెలిపారు.