'వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి'
MDK: మెదక్ మెడికల్ కళాశాల, క్రిటికల్ కేర్ సెంటర్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని, అత్యంత నాణ్యత ప్రమాణాలతో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం చివరి దశలో ఉందని, శిశు వైద్య విభాగాలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.