ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు...!

ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు...!

SRPT: హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఇందిరా చౌక్, టీ స్టాల్ వద్ద పార్కింగ్ ప్లేసులు లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో భారీ వాహనా రాకపోకలతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.