3.70 కోట్ల మంది చేతిలో 1,302 మంది భవిత
బీహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 20 జిల్లాల్లోని మొత్తం 122 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించడానికి 45,399 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 122 అసెంబ్లీ స్థానాల కోసం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సుమారు 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.