నేషనల్ అవార్డుకు కరాటే మాస్టర్ ఎంపిక
జగిత్యాల పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ శ్రీనివాస్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. పంజాబ్‌లోని అమృత్ సర్‌లో యూత్ & స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో 2025- 26లో స్పోర్ట్స్ అచీవ్మెంట్ విభాగంలో ఆయనను ఎంపిక చేసినట్లు అవార్డు కమిటీ కన్వీనర్, యూత్ & స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.