'రాజ్యాంగంలోని హక్కులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి'
MNCL: మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో కానిస్టేబుల్ దిలీప్ ఆధ్వర్యంలో వాకర్ అసోసియేషన్ సభ్యులకు రాజ్యాంగ పుస్తకాలు ఇవాళ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలోని హక్కులు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అంతేకాకుండా సమాజం కోసం తన జీవితాన్ని ధారబోసిన అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు.