శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

అనకాపల్లి: మాకవరపాలెం మండలం పెద్దమిల్లు జంక్షన్‌లో ఉన్న వామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వయం భూ లింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఏటా మహా శివరాత్రి ముందు ఇలా సూర్యకిరణాలు ఈ స్వయం భూ లింగాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం కూడా కిరణాలు లింగాన్ని తాకడంతో భక్తులు ఈ దృశ్యాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు.