'ఈనెల 20న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'

NZB: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేశ్ పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను మండలంలోని బాబాపూర్ చార్ భాయ్ బీడీ కంపెనీలో శనివారం ఆవిష్కరించారు.