రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని నూకలపాలెంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన హరీష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వీరిద్దరు బైకుపై వెళుతుండగా మార్గమధ్యలో బైకు అదుపుతప్పి వెల్డింగ్ షాపును ఢీకొన్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.