కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత వహించాలి: కలెక్టర్

కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత వహించాలి: కలెక్టర్

KMR: మాచారెడ్డి మండలం సోమవారం పేట్ గ్రామ పరిధిలోని నెమలి గుట్ట తండాలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం తనిఖీ చేశారు. వరి స్వీకరణ విధానం, తూకాల యంత్రాలు, నిల్వ సదుపాయాలు, రైతులకు అందిస్తున్న సేవలు, బిల్లుల జారీ, లోడింగ్ అంశాలను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.