వైసీపీ బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం

వైసీపీ బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం

అన్నమయ్య: రాజంపేట మండలంలోని ఆకేపాటి ఎస్టేట్‌లో బుధవారం YCP MLA ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి అధ్యక్షతన రాజంపేట పార్లమెంట్ బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కొండమడుగుల సుధాకర్ రెడ్డి, మాజీ MLAలు కోరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై నేతలు దిశానిర్దేశం చేశారు.