పుష్పాలతో వాడపల్లి వెంకన్న ఆలయంలో విశేష అలంకరణ
కోనసీమ: ఉగాదిని పురస్కరించుకుని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని గురువారం సర్వాంగ సుందరంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలతో స్వామివారి ఆలయం శోభాయ మానంగా భక్తులకు కనువిందు చేస్తోంది. దీంతో పాటు ఆలయాన్ని విద్యుత్ దీపాల కాంతులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పుష్పాలంకరణ శోభితులై స్వామి అమ్మ వార్లు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.