నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ బూర్జ మండలం ఉప్పిని వలసలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమర్ధవంతంగా చేపట్టామని పేర్కొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ విశ్వ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.