నంద్యాలలో అభివృద్ధి పనులు పరిశీలన

NDL: నంద్యాలలోని 27వ వార్డులో రూ.40 లక్షలతో నిర్మిస్తున్న రోడ్లను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎండి ఫిరోజ్ బుధవారం పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి మంత్రి పరువుకు అభివృద్ధి పనులను చేపట్టారని ఆయన చెప్పారు. అనంతరం వార్డులో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కాగా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోందని చెప్పారు.