పోషణ పక్వాడపై గర్భిణీలకు అవగాహన
సత్యసాయి: అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడా పేరుతో పదిహేను రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టారు. అందులో భాగంగా రొళ్ల మండలం వన్నారన్నపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు వివిధ అంశాలను వివరించారు. సంపూర్ణ పోషణ, పిల్లల ఎత్తు, బరువుల నమోదు, రక్తహీనత నివారణ, పారిశుద్ధ్యం, వర్షపునీటి నిల్వ తదితర అంశాలపై అవగాహన కల్పించారు