నేడు రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ

నేడు రవీంద్రభారతిలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ

HYD: గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఇవాళ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి ప్రాంగణంలో జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో సినీ సంగీత దర్శకులు కీరవాణి, తమన్, నేపథ్య గాయకులు, బాలు కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు.