నందిగామ బైపాస్‌లో ఆటో బోల్తా

నందిగామ బైపాస్‌లో ఆటో బోల్తా

RR: నందిగామ బైపాస్ రోడ్డులో ఆటో బోల్తా శనివారం పడింది. కాకినాడ నుంచి కొబ్బరికాయలను గూడ్స్ ఆటోలో తీసుకొని మహబూబ్ నగర్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో ఎంఎస్ఎన్ పరిశ్రమ వద్ద టైర్ బ్లాస్ట్ కావడంతో బోల్తా పడింది. ఇందులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు అక్కడికి చేరుకొని ఆటోను పక్కకు తొలగించారు.