RTC బస్సులో పొగలు.. తప్పిన ప్రమాదం
అన్నమయ్య: మదనపల్లె డిపోకు చెందిన RTC నాన్-స్టాప్ బస్సులో సోమవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పీలేరు సమీపంలోని రొంపిచర్ల క్రాస్ వద్దకు చేరుకున్న సమయంలో బస్సు లోపల అకస్మాత్తుగా పొగలు ఎగసిపడ్డాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.