మంచినీటి బోరును ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: నల్లజర్ల మండలంలోని చాదరాశిగుంట గ్రామంలో నూతన మంచినీటి బోరును గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజల మంచినీటి సమస్యను తీర్చడానికి మంచినీటి బోరును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.