పేదల పెళ్లికి అండగా టీఎంఆర్ ఫౌండేషన్

పేదల పెళ్లికి అండగా  టీఎంఆర్ ఫౌండేషన్

SRD: జహీరాబాద్ పట్టణ పరిధిలోని పస్తాపూర్ గ్రామంలో టీఎంఆర్ ఫౌండేషన్ జహీరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం తాళి, మెట్టెలు సమర్పించే కార్యక్రమం నిర్వహించారు. టీఎంఆర్ జాతీయ అధ్యక్షులు పంతటి రాజు ఆదేశాల మేరకు జహీరాబాద్ టీఎంఆర్ అధ్యక్షులు జానారెడ్డి నూతన వధువు చాకలి శంకర్-అనితల కూతురి వివాహానికై తమ వంతు సహాయంగా తాళి, మెట్టెలు అందజేయడం జరిగింది.