మంత్రి చొరవతో.. సీసీ రోడ్డు నిర్మాణం
NRPT: మక్తల్ మండలంలోని మద్వార్ గ్రామంలో శ్రీ గట్టు తిమ్మప్ప ఆలయానికి ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మంత్రి శ్రీహరి కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మిస్తానన్నారని హామీ ఇచ్చి నెరవేర్చినందుకు గ్రామ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.