"బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి"

"బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి"

ASR: రైవాడ డ్యాంలో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. సోమవారం అనంతగిరిలో ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలు కోల్పోయినవారంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని ఆయన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.