ఈ నెల 30న సంచార జాతుల ఇండిపెండెన్స్ డే

W.G: సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవాలను అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆ సంఘ వ్యస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం నరసాపురంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భీమవరంలో జరిగే సభను జయప్రదం చేయాలన్నారు.1952 ఆగస్టు 31న భారతదేశవ్యాప్తంగా నేరస్తులుగా ఉన్న సంచార జాతుల వారిని విముక్త జాతులుగా గుర్తిస్తూ చట్టం తీసుకువచ్చారన్నారు.