రోడ్డు ప్రమాదాల నివారించాలి: ఎస్పీ
GDWL: రోడ్డు ప్రమాదాల నివారణకు 'విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీలను' తప్పక ఏర్పాటు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు ఇవాళ నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది విధుల పట్ల నిబద్ధత కలిగి ఉండి, బాధితులందరినీ సమానంగా చూడాలని ఆదేశించారు. అలాగే, ఈ నెలలో నమోదైన కేసుల వివరాలను స్టేషన్ల వారీగా సమీక్షించాలన్నారు.