'ప్రజల మేలుకోసమే వైద్య శిబిరాలు'

'ప్రజల మేలుకోసమే వైద్య శిబిరాలు'

MNCL: ప్రజల మేలుకోసమే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జన్నారం ప్రభుత్వాసుపత్రి ఏఎన్ఎం కల్పన, ఆశ వర్కర్ వజ్ర అన్నారు. ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ ఆదేశాల మేరకు గురువారం జన్నారంలోని రాంనగర్ కాలనీలో స్థానికులకు బిపి, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇంటి పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు.