దివిసీమ ఉప్పెన మాన‌ని గాయం

దివిసీమ ఉప్పెన మాన‌ని గాయం

కృష్ణా: 1977 నవంబర్ 19 దివిసీమ చరిత్రలో చెరగని గాయం. ఈ రోజున సముద్రం రాక్షసంలా పొంగిపొర్లి దారిలో వచ్చిన గ్రామాలను మట్టికరిపించింది. నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి ఊళ్లు క్షణాల్లో లేకుండాపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 14 వేలకుపైగా ప్రాణాలు పోయాయి. బాధాకరం ఏమిటంటే ఈ మహా విపత్తు జరిగిన మొదటి 3 రోజులు బాహ్య ప్రపంచానికి సమాచారం తెలియకపోవడం.