ఇందిరమ్మ వరద కాలువ గేట్ల ఎత్తివేత

ఇందిరమ్మ వరద కాలువ గేట్ల ఎత్తివేత

NZB: కమ్మర్ పల్లి మండలం నాగాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువ బాటమ్, టాప్ గేట్లను ఆదివారం అధికారులు ఎత్తివేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. కాలువ నిండి పొంగిపొర్లుతున్న దృశ్యాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. గేట్లు ఎత్తడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.