డ్రగ్ కేసుల్లో 11 మందికి ఈగల్ టీమ్ కౌన్సెలింగ్
HYD: ఈగల్ టీమ్ దూకుడు కొనసాగుతోంది. గంజాయి సేవిస్తున్న 11మందిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్స్ పోలీసులు తల్లిదండ్రుల సమక్షంలోనే డ్రగ్ టెస్టులు నిర్వహించారు. తర్వాత కౌన్సెలింగ్ ఇచ్చి రీహాబిలిటేషన్‌కు తరలించారు. సికింద్రాబాద్, మేడ్చల్, హకీంపేట్ ప్రాంతాలకు చెందిన బ్యాంక్ ఉద్యోగులు, కార్పొరేట్ సిబ్బంది,ట్రైనర్లు,వ్యాపారులు కూడా డ్రగ్స్ వలలో చిక్కుకున్నారు.