సిద్ధి వినాయకుని గుడిలో దొంగతనం..!
ప్రకాశం: ఒంగోలు వన్ టౌన్ పరిధిలో సీతారాంపురం కాలనీ శర్మ కాలేజ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న సిద్ధి వినాయకుని గుడిలో దొంగలు పడ్డారు. హుండీలో ఉన్న డబ్బులు తీసుకువెళ్లినట్లు పూజారి తెలిపారు. గుడి లోపల ఉన్న వేప అంకమ్మ గుడిలో గోడదూకి అమ్మవారి మెడలో ఉన్న నకిలీ నగను తీసుకువెళ్లినట్లు పూజారి తెలిపారు. హుండీలో ఎంత నగదు ఉందో తెలియదన్నారు.