పాలవాయిలో సచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం

పాలవాయిలో సచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని పాలవాయి గ్రామంలో సచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమ ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని, ఇదే సచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.