ఈనెల 19న కవి సమ్మేళనం
W.G: ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు జరగనున్న కవి సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని తెలుగు సాహితీ సమాఖ్య అధ్యక్షుడు జంగా శ్రీనివాస్ రామ్ కోరారు. శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో తెలుగు సాహితీ సమాఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉగాది రోజున కవి సమ్మేళనం జరుగుతుందన్నారు.