ముగిసిన పల్లె సంగ్రామం
నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం సైతం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.