108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
NZB: ఇందల్వాయి మండలం రూప్లానాయక్ తండాకు చెందిన మంజుల బుధవారం తెల్లవారుజామున 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. మంజులను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఈఎంటీ అంబాదాస్, పైలట్ సుభాష్ సమయస్ఫూర్తితో చాకచక్యంగా ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, వీరిని NZB జిల్లా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.