ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ELR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించేటప్పుడు వాహనదారులు సాహసాలు చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 112, 8332959175 నంబర్లను సంప్రదించాలని సూచించారు.