PGRS కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

PGRS కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NDL: చాగలమర్రి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి వివరించి వినతిపత్రాలు సమర్పించారు. 200కి పైగా అర్జీలు రావడంతో, ఎమ్మెల్యే ప్రతి ఒక్క అర్జీని వ్యక్తిగతంగా స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు.