మాజీ ఎమ్మెల్యే‌కు కీలక పదవి

మాజీ ఎమ్మెల్యే‌కు కీలక పదవి

BDK: భద్రాచలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొదెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ సలహా మండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏఐసీసీ నియమించినట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన విధేయతతో ప్రజాసేవపై అంకిత భావంతో ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించడంతో ఈ బాధ్యతలు అప్పగించారు.