VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

KMM: సత్తుపల్లి పట్టణం తాళ్లమడ వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. సత్తుపల్లికి చెందిన స్వర్ణలత (45) గంగారం నుంచి స్కూటీపై తిరిగి వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆమె స్కూటీతో సహా లారీ కిందకు దూసుకుపోవడంతో అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.