VIDEO: 'గ్యాస్ ధరల పెరుగుదల వల్ల పేదలపై భారం పడుతుంది'
కృష్ణా: గుడివాడ సుందరయ్య భవన్‌లో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్. సీపీ రెడ్డి సోమవారం స్పందించారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచిందని, గతంలో రూ.5,10 పెంచేవారని, 60 గ్యాస్ సిలిండర్ ధర పెంచడం దుర్మార్గమని అన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుందని తెలిపారు.